*డిసిపి తో సమావేశమైన ఫోక్సో కోర్ట్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాంబావ్*
*మంచిర్యాల జిల్లా
జిల్లా డిప్యూటీ కమిషన్ ఆఫ్ పోలీస్ (డిసిపి) ఏ భాస్కర్, ఐపీఎస్ ను గురువారం ఆయన కార్యాలయంలో జిల్లా ఫోక్సో కోర్టు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ రాంబావ్ మర్యాదపూర్వకంగా కలిసి, ఆయనతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు మొక్కను బహుకరించారు. అనంతరం వారు జిల్లాలో చిన్న పిల్లలు, బాలికలు, మహిళలపై వివిధ రకాల వేధింపుల పట్ల చర్చించారు. మంచిగా నటిస్తూ కొందరు చిన్న పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని, బంధువులు, స్నేహితులు, ఇతర స్నేహితుల రూపంలో చుట్టూనే ఉంటూ, పిల్లలతో వికృత క్రీడలకు తెరలేపుతున్నారని, ఇలాంటి వారి నుండి చిన్న పిల్లలను కాపాడే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజలింగు మోతె, కాగితపు సునీల్ కుమార్ లు పాల్గొన్నారు.