లక్కీ డ్రా పేరిట మోసం — వ్యక్తి అరెస్ట్
— భూమి విక్రయానికి టోకెన్‌గా రూ.500 వసూలు చేసిన రాజుపై కేసు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 18
మంగళవారం: రాజంపేట మండలం బసన్నపల్లి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి లక్కీ డ్రా, టోకెన్ సిస్టమ్ పేరుతో భూమి విక్రయిస్తానంటూ కరపత్రాలు, వాట్సాప్ స్టేటస్‌ల ద్వారా ప్రజలను మోసగించినట్లు సీఐ సంపత్ కుమార్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన రాజుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు చెప్పారు.