*ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కోర్సు*
*జమ్మికుంట మార్చి 3 ప్రశ్న ఆయుధం*
జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలోని కంప్యూటర్ సైన్స్ విభాగం అధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ సర్టిఫికెట్ కోర్సును కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.రమేష్ సోమవారం ప్రారంభించారు. ఈ సంధర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నేటి ఆధునిక సాంకేతిక కాలంలో కంప్యూటర్ విద్యకు చాలా ప్రాధాన్యత ఉందన్నారు. నెల రోజుల పాటు కళాశాలలోని విద్యార్థుని విద్యార్థు లందరికీ *ఎమ్మెస్ వరల్డ్* *ఎమ్మెస్ ఎక్సెల్* *పవర్ పాయింట్* వంటి తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. ఎస్. ఓదెలు కుమార్, కంప్యూటర్ విభాగం ఇంచార్జీ కిరణ్ కుమార్ , అధ్యాపకులు డా. పీ సుమ్మ, డా. రవి ప్రకాష్ రావు, ఎస్ రమేష్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.