స్నేహ బీహెచ్ఈయల్ లేక్ వ్యూలో ఉచిత డెంటల్ క్యాంపు

సంగారెడ్డి/పటాన్ చెరు, జూలై 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామచంద్రాపురంలోని రాంచంద్రారెడ్డినగర్ లో గల శ్రీ స్నేహ బీహెచ్ఈయల్ లేక్ వ్యూ రెసిడెన్సిలో “డాక్టర్ సునయన వైట్ అండ్ బ్రైట్ డెంటల్ క్లినిక్” ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత డెంటల్ క్యాంపు నిర్వహించారు. ఆదివారం ఉదయం రెసిడెన్సిలోని పెద్దల చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఉచిత డెంటల్ క్యాంప్ సాయంత్రం వరకు కొనసాగింది. డాక్టర్ వల్స సునయన నేతృత్వంలో వైద్యుల బృందం అపార్ట్మెంట్ వాసులకు ఊచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించి, దంత సంరక్షణకు సంబంధించిన పలు సూచనలు చేశారు. ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు మొదటి వంద మందికి దంతదావనానికి అవసరమైన టూత్ బ్రష్, టూత్ పేస్టుతో కూడిన సెట్టును అందజేశారు. ఈ డెంటల్ క్యాంపులో తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండం మోహన్ రెడ్డి దంత పరీక్షలు చేయించుకొని తమ రెసిడెన్సీలో ఉచిత డెంటల్ క్యాంపు ఏర్పాటు చేసిన డాక్టర్ సునయన బృందాన్ని అభినందించారు. ఈ క్యాంపులో డాక్టర్ సునయనతో పాటు డాక్టర్ శ్రద్ధ, డాక్టర్ సింధు, డాక్టర్ సలేహా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది సరిత, రామా హరికృష్ణ , డాక్టర్ వలస పైడి, అపార్ట్మెంట్ పెద్దలు, అపార్టుమెంటు నివాసితులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now