ఉచితంగా పుస్తకాలు పంపిణీ

పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పుస్తక పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న బండి రమేష్
ప్రశ్న ఆయుధం జూలై 25 : కూకట్పల్లి ప్రతినిధి

అన్ని దానాలలోకి విద్యాదానం గొప్పదని పేద విద్యార్థులకు అవసరమైన సహాయం చేయడం అభినందనీయమని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్, అన్నారు. కబీర్ నగర్ కు చెందిన రమేష్ అయ్యంగార్, శివ రామాంజనేయ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నేతాజీ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పుస్తక పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు 100 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు షూస్ సాక్స్ లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఆర్థిక కారణాలతో ఏ పేద విద్యార్థి చదువు మానకూడదు అన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కార్యక్రమంలో నాయకులు తూము వేణు రాఘవేంద్ర సతీష్ గౌడ్ సుధాకర్ రెడ్డి బుచ్చన్న ఆనంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now