జర్నలిస్టులకు ఉచిత ఐ క్యాంపు

టీజేయూ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత ఐ క్యాంపు

కంటి పరీక్షలు నిర్వహించిన సుమంత్ ఆస్పత్రి కంటి వైద్యులు

మందులు , కంటి అద్దాలు పంపిణీ చేసిన డాక్టర్లు

వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపిన టీజేయూ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ షానూర్ బాబా

ప్రశ్న ఆయుధం21జులై /మోటకొండూర్
ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా సేవలందిస్తున్న మీడియా జర్నలిస్టులకు వృత్తిపరమైన పనిలో
కంటి సమస్య తలెత్తుతున్న సందర్భంగా పని ఒత్తిడిలో
వైద్య పరీక్షలు చేయించుకోలేని జర్నలిస్టుల కోసం
తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మమ్మద్ షానూర్ బాబా ఆధ్వర్యంలో
భువనగిరి పట్టణంలోని ప్రముఖ కంటి వైద్యశాల
సుమంత్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో జర్నలిస్టులకు ఆదివారం కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు , మందులు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా లోని వివిధ మండలాల నుండి టీ జే యూ జర్నలిస్టులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీ జే యూ షానూర్ బాబా మాట్లాడుతూ జర్నలిస్టులతో పాటు ప్రతి ఒక్కరు కంటి వ్యాధుల పట్ల నిర్లక్ష్యము చేయరాదని సంబంధిత వైద్యులను సంప్రదించి తగు సూచనలను అనుసరించి వైద్యం చేయించుకుని కంటి అద్దాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
అదేవిధంగా పూర్తిపరమైన పనులు వృత్తిపరమైన పనులలో దుమ్ము , ధూళి , ఎండ వాన చలి కాలా లను లెక్కచేయకుండా అనునిత్యం ప్రజల్లో తిరుగుతున్న జర్నలిస్టులకు వార్తల సేకరణలో కంప్యూటర్ , మొబైల్ వాడడం
నిత్యము బైక్ పై తిరగడం జరుగుతుందని దీంతో కంటి వ్యాధులు సోకే అవకాశాలు ఉన్నాయని కాబట్టి కంటి విషయంలో ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండొద్దు అని జర్నలిస్టులను కోరారు .
జర్నలిస్టులకు ఉచిత కంటి వైద్యం అందించిన కంటి ఆస్పత్రి డాక్టర్లకు , యజమాన్యానికి , సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్లకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీ జే యూ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న, జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవరకొండ లావణ్య, మహిళా ప్రధాన కార్యదర్శి కంది చంద్రకళ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దూడల అంబిక,జిల్లా కార్యదర్శి గుర్రాల నాగరాజు,జిల్లా ఉపాధ్యక్షులు షేక్ రషీద్,గుర్రం మల్లేష్, సుధ గాని నవీన్ గౌడ్, జిల్లా కోశాధికారి సిరిల్ , జిల్లా సహా కార్యదర్శి నోముల రవీందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు దేవి రెడ్డి సత్తిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టికొ ప్పుల శ్రీనివాస్,గడ్డం సత్యనారాయణ,ఆత్మకూరు మండల అధ్యక్షుడు గడ్డం నాగరాజు,గుండాల మండల అధ్యక్షుడు సూరారపు నరేష్, ఆలేరు మండల అధ్యక్షుడు చింతకింది వెంకటేశ్వర్లు, మోటకొండూరు మండల అధ్యక్షుడు గట్టికొప్పుల శ్రీనివాస్, రాజపేట మండల అద్యక్షులు భూపతి శ్రీనివాస్ , టీ జే యూ జర్నలిస్ట్ సభ్యులు మోహన్ సునీల్ దశరథ సోమనర్సయ్య, సతీష్,శ్రీకాంత్ , అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now