ఉచిత కంటి పరీక్షల శిబిరం
చేర్యాల ఆగస్టు 24 ప్రశ్న ఆయుధం :
శభాష్ గూడెం ప్రాథమిక పాఠశాలలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ మాధవి పి,డాక్టర్ బాలకిషన్ కె ఆధ్య ఐ కేర్ సిద్దిపేట మరియు చేర్యాల సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ యొక్క శిబిరంలో 52 మంది విద్యార్థులకు,100 మంది గ్రామ ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో 15 మందికి ఆపరేషన్ అవసరం అని గుర్తించారు. అందులో 6 మంది నీ ఆపరేషన్ కోసం సిద్దిపేట ఆధ్య ఐ కేర్ హాస్పిటల్ కి తీసుకుపోయారు. 10 మంది విద్యార్థులకు కళ్ళ అద్దాలు అవసరం అని నిర్ధారించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరాఠీ సంతోష్,ఉపాధ్యాయులు సోమారపు రేణుక ,పి. మోహన్ బాబు,బండకింది స్వప్న , చైర్మన్ గుడ్డేటి కనకలక్ష్మీ మరియు మాజీ సర్పంచ్ బొడ్డు కిరణ్,గంధాల బాలు,బండకింది రాజశేఖర్,బండకింది బాపురాజు, ఆశ వర్కర్ మారబోయిన అనిత,పూర్ణ, రాజుపేట జాను తదితరులు పాల్గొన్నారు.