28వ డివిజన్ లో ఉచిత కంటి పరీక్షలు

*28వ డివిజన్ లో ఉచిత కంటి పరీక్షలు*

ఖమ్మం మూడవ పట్టణం 28వ డివిజన్ నందు ఆదివారం నిర్వాహకులు కొల్లి విద్యాసాగర్ , పోతుల నరసింహారావు , సారంగుల రమణ ల ఆధ్వర్యంలో శరత్ మాక్సవిజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు . సుమారుగా 300 మంది దాకా పాల్గొని ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఉపయోగించుకుని విజయవంతం చేశారు . అవసరమైన వాళ్లకి ఉచితంగా కంటి అద్దాలను అందజేస్తామన్నారు . 20 మందికి కంటిలో చెడు మాంసం పెరగడంతో వారికి తెల్ల రేషన్ కార్డు ద్వారా కంటి ఆపరేషన్ చేస్తామని ఆసుపత్రి బృందం కో ఆర్డినేటర్ బి.విక్రమ్ సింగ్ , ఆప్టోమెట్రిస్ట్ డాక్టర్ ప్రశాంత , కౌన్సిలింగ్ డాక్టర్ శ్రీకాంత్ , సహాయకుడు ఎస్.కె ఖాజాపాషా తెలియజేశారు .

Join WhatsApp

Join Now