జాతీయ సేవా శిబిరంలో ఉచిత వైద్యం మరియు వన మహోత్సవ కార్యక్రమం

ప్రశ్నఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి నవంబర్ 6
ఆరోగ్యమే మహాభాగ్యం అని నేటి సమాజానికి తెలియజేసే, ఒక వ్యవస్థను పరిచయం చేసే దిశగా అశ్వరావుపేట
వ్యవసాయ కళాశాల, అశ్వరావుపేట వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరంలో భాగంగా మల్లారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దమ్మపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ మణిదీప్ గారు పాల్గొని మల్లారం గ్రామ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేసి, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవసాయ కళాశాల, అసోసియేట్ డీన్ డాక్టర్ జై హేమంత్ కుమార్ మాట్లాడుతూ
ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి ఒక్కరు పోషక ఆహారాన్ని తీసుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, వ్యాయామం చేయటం, ఆటలు ఆడటం, ప్రతిరోజు కొంత దూరం నడవటం వంటి ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు అలవర్చుకోవాలి అన్నారు. అనంతరం డాక్టర్ మణిదీప్ మాట్లాడుతూ అనారోగ్య సమస్యలు రాకుండా అదే విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. అనంతరం మల్లారం గ్రామంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామం లోని రోడ్ల పక్కన మరియు రైతు వేదికలో మొక్కలు నాటారు. ఈ హరితహారం కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె. హేమంత్ కుమార్ మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో, భూమిలో సేంద్రియ పదార్థాన్ని పెంపొందించడం, భూతాపాన్ని నివారించుటలో పచ్చని చెట్లు ప్రధాన పాత్రను పోషిస్తాయి అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరూ విధిగా తమ పరిసరాలలో పచ్చదనం ఉండేలా మొక్కలు నాటాలి అన్నారు.
తర్వాత విద్యార్థులు రాత్రి జరిగేటువంటి క్యాంపు ఫైర్ సాంస్కృతిక కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల జాతీయ సేవా పథకం కార్యక్రమం అధికారులు డాక్టర్ ఎం. రాంప్రసాద్, డాక్టర్ పి. రెడ్డి ప్రియ, డాక్టర్ టి. శ్రావణ్ కుమార్, గ్రామ ప్రజలు మరియు కళాశాల చివరి సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now