*మాధవ సేవా సమితి – ఉచిత వైద్య శిబిరం*
*కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో సెప్టెంబర్ 8*
కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాధవ సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ క్రమంలో ఆదివారం స్థానిక కరీంనగర్ లోని గౌతమి నగర్ ఎస్సీ ఎస్టీ బస్తీలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వి. సంగీతా రెడ్డి నాగేంద్ర పెథాలజీ ల్యాబ్ డాక్టర్ రవి లచే బస్తీలోని ప్రజలకు, పిల్లలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందించడం జరిగిందని శిబిరంలో42 మంది పిల్లలు పెద్దలు వైద్య పరీక్ష చేయించుకున్నారని అనంతరం వైద్య నిపుణులు పిల్లల ఆరోగ్య ఆహార నియమాలపై పిల్లల తల్లిదండ్రులకు తగిన సూచనలు చేసి అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు ఎల్లంకి హనుమంతరావు సమితి కార్యదర్శి గుర్రాల మహేశ్వర్ రెడ్డి ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యవాహ పాక సత్యనారాయణ సభ్యులు కామారపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.