గుల్ మొహర్ పార్క్ లో ఉచిత వైద్య శిబిరం 

గుల్ మొహర్ పార్క్ లో ఉచిత వైద్య శిబిరం

ప్రశ్న ఆయుధం జూన్07: శేరిలింగంపల్లి ప్రతినిధి

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గుల్ మొహర్ పార్క్ లో గుల్ మొహర్ పార్క్ అధ్యక్షులు. షేక్ ఖాసీం, జనరల్ సెక్రెటరీ. ఎస్.ఆనంద్ కుమార్ ల ఆధ్వర్యంలో ఉద్బవ హాస్పిటల్స్ వారిచే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో బరువు, బీపీ, షుగర్, జనరల్ వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యశిబిరానికి స్థానిక కాలనీవాసులు, చుట్టుపక్కలవారు చేరుకుని శిబిరంలోని వైద్య పరీక్షలను సద్వినియోగ పరుచుకొన్నారు. ఈ సందర్భంగా గుల్ మొహర్ పార్క్ అధ్యక్షులు. షేక్ ఖాసీం, జనరల్ సెక్రెటరీ. ఎస్. ఆనంద్ కుమార్ లు మాట్లాడుతు, ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పినట్లుగా మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతిఒక్కరు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఆరోగ్య పరీక్షలను తప్పనిసరిగా చేయించుకోవాలని, ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని అందరూ ఆరోగ్య వంతులుగా ఉండాలని తెలిపారు. ఉచిత వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు జరిపి సూచనలు సలహాలను తెలియజేసిన డాక్టర్లను అభినందిస్తు, భవిష్యత్తులో ఇలాంటి సేవలను విస్తృతస్థాయిలో అందించాలని కోరుతూ ఉద్బవ హాస్పిటల్స్ వారికి ధన్యవాదాలు తెలియజేసారు.

Join WhatsApp

Join Now