వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం

వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం

జమ్మికుంట ఇల్లందకుంట ఆగస్ట్ 6 ప్రశ్న ఆయుధం

మండల పరిధిలో గల శ్రీరామ సాయి సేవ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బృందం సీజనల్ మెడికల్ క్యాంపు నిర్వహించారు బుధవారం రోజున డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చందు ఆధ్వర్యంలో 21 మంది వృద్ధులకు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేసి మందులు అందజేశారు వర్షాకాలం ఆరంభమైన వేళ చుట్టుపక్కల ఎక్కడ నీరు నిలువ ఉండకుండా పొడి వాతావరణాన్ని ఉంచుకుంటూ పరిశుభ్రంగా ఉండాలని వివరించారు నిలువ ఉన్న నీటిలో డెంగ్యూ, చికెన్ గునియా మలేరియా దోమలు ద్వారా జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని పరిశుభ్రతలందరూ ప్రాథమిక బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు కలుషిత ఆహారం ద్వారా డయేరియా వ్యాప్తి చెందే అవకాశం ఉందని కాబట్టి ఎప్పటికప్పుడు తాజా ఆహారం తీసుకోవాలని వివరించారు వాడకూడదని పూర్తి స్థాయిలో వివరించారు ఈ కార్యక్రమంలో పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తులసీదాస్ పల్లె దావఖానా డాక్టర్ కళ్యాణ్ సిహెచ్ శ్యామల, రోజా రాణి, ఆశాలు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు*

Join WhatsApp

Join Now

Leave a Comment