సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి మున్సిపాలిటీలోని 32వ వార్డులో వెల్నెస్ హాస్పిటల్ సౌజన్యంతో కౌన్సిలర్ రామప్ప ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం 32వ వార్డులో ఉచిత వైద్య శిబిరాన్ని వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా.. ముఖ్యఅతిథిగా కౌన్సిలర్ రామప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీ వాసులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది కాలనీవాసులు పాల్గొన్నారు.