Site icon PRASHNA AYUDHAM

లయన్స్ క్లబ్ అమీన్ పూర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

IMG 20250720 202221

Oplus_0

IMG 20250720 202209
సంగారెడ్డి/పటాన్ చెరు, జూలై 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): సామాజిక బాధ్యతగా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని లయన్స్ క్లబ్ అమీన్ పూర్ అధ్యక్షుడు కురా నాగరాజు తెలిపారు. ఆదివారం లయన్స్ క్లబ్ హైదరాబాద్ అమీన్ పూర్ శాఖ ఆధ్వర్యంలో బృందావన్ టీచర్స్ కాలనీ క్లబ్ హౌస్‌లో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జోన్ చైర్మన్ బుల్కాపురం కృష్ణగౌడ్, కాలనీ అధ్యక్షుడు పట్నం సురేందర్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ..ఈ శిబిరానికి పనాసియా మెరిడియన్, ఎలైట్ ఐ హాస్పటల్ వైద్య బృందాలు వైద్య సేవలు అందించాయని,శిబిరంలో రక్తంలో షుగర్ స్థాయి, రక్తపోటు, ఈసీజీ, కంటి పరీక్షలు వంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో 110 మంది ప్రజలను పరీక్షించి, ఉచితంగా మందులు పంపిణీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కట్లే సిద్ధిరాములు, కోశాధికారి తెర్పల్లి కరుణాకర్ రెడ్డి, సహ కార్యదర్శి మమిడి కృష్ణగౌడ్, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ చౌకి వెంకటేశం, సహా సభ్యులు నాగభూషణం, శ్రీశైలం, శశిధర్, యాదయ్య, అంబాదాస్, లింగం, రామ నర్సింహా రెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Exit mobile version