పిఎసిఎస్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

పిఎసిఎస్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

గజ్వేల్ నియోజకవర్గం, 27 జనవరి 2025 :

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామం లో సోమవారం పి.ఎ.సి.ఎస్ డైరెక్టర్ బూర్గుల సురేందర్ రావు సౌజన్యంతో కీ,శే, బూర్గుల మల్లవ్వ, యాదం రావు జ్ఞాపకార్థం అదితి హాస్పిటల్ ప్రజ్ఞాపూర్, ఆద్య కంటి హాస్పిటల్ సిద్దిపేట వారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేశారు. ఈ సందర్భంగా పి.ఎ.సి.ఎస్ డైరెక్టర్ సురేందర్ రావు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని, మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసానని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఈ వైద్య శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సేవ చేయడంలో తృప్తి ఉంటుందని, గ్రామంలో ప్రజలకు సేవ చేయడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని సేవే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాధవి, బాలకిషన్, వైద్య సిబ్బంది, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now