ఉద్భవ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 21: శేరిలింగంపల్లి ప్రతినిధి
శేరిలింగంపల్లి: గుల్ మొహర్ కాలనీలోని గుల్ మొహార్ పార్కులో మియాపూర్ ఉద్భవ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో 21వ తేదీ సోమవారం ఉదయం 06గంటల నుండి 10గంటల వరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో బిపి, షుగర్, బరువు పరీక్షలను ఉచితంగా నిర్వహించి తగు సూచనలు సలహాలను అందించారు.ఈ సందర్భంగా గుల్ మొహర్ కాలనీ అసోసియేషన్ వారు మాట్లాడుతూ, ఉచిత వైద్య శిభిరం లోని ఆరోగ్య పరీక్షలను సద్వినియోగ పరచుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యం అని, ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగ పరచుకుని ఆరోగ్యంగా వుండేందుకు ముందడుగు వేయాలని సూచించారు. ఉచిత వైద్య శిబిరానికి స్థానిక కాలనీవాసులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఉచిత వైద్య శిబిరంలోని ఆరోగ్య పరిక్షలను సద్వినియోగ పరుచుకున్నారు.