ఉచిత వైద్య సేవలు ఉచిత మందులు పంపిణీ  మాధవ సేవా సమితి కరీంనగర్

ఉచిత వైద్య సేవలు ఉచిత మందులు పంపిణీ

మాధవ సేవా సమితి కరీంనగర్

కట్టరాంపూర్ గౌతమి నగర్‌లో ఉచిత వైద్య శిబిరం

*కరీంనగర్, జూలై 27 ప్రశ్న ఆయుధం*

మాధవ సేవా సమితి కరీంనగర్ వారి ఆధ్వర్యంలో స్థానిక కట్టరాంపూర్, గౌతమి నగర్‌లోని ఎస్సీ, ఎస్టీ బస్తీలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బస్తీలోని అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు,అవసరమైన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు.ప్రస్తుతం వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, పరిసరాల పరిశుభ్రతపై స్థానిక నివాసితులకు అవగాహన కల్పించారు. ఈ శిబిరంలో మొత్తం 76 మంది తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకున్నారు. కార్యక్రమం స్థానిక బస్తీ కమ్యూనిటీ హాల్‌లో జరిగింది.ప్రముఖ వైద్యులు డాక్టర్ చక్రవర్తుల రమణాచార్యులు వైద్య బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సప్తఋషి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సురేష్, ఈఎన్ టి వైద్యులు డాక్టర్ లిఖిత, డాక్టర్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో మాధవ సేవా సమితి అధ్యక్షుడు సి ఎ నిరంజన్ చారి కార్యదర్శి కామరపు ప్రసాద్, సంయుక్త కార్యదర్శి చంద్రశేఖర్ స్వయంసేవక కార్యకర్తలు ముఖ్యపాత్ర వహించారు.

Join WhatsApp

Join Now