కామారెడ్డి జిల్లాలో ఉచిత మెగా క్యాన్సర్ పరీక్ష శిబిరం

కామారెడ్డి జిల్లాలో ఉచిత మెగా క్యాన్సర్ పరీక్ష శిబిరం

కామారెడ్డి జిల్లా ఇంఛార్జి

(ప్రశ్న ఆయుధం)జులై 24

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో   ఈ నెల 26 న ఉచిత మెగా క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కామారెడ్డి రోటరీ క్లబ్ అధ్యక్షులు వై. శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి రోటరీ క్లబ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ల సహకారంతో హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉచిత శిబిరం ఈనెల 26 శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందన్నారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ల బృందం ద్వారా 17,100 రూపాయల విలువగల క్యాన్సర్ టెస్టు లను  ఉచితంగా చేయబడును అని ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ డా, మధు దేవర శెట్టి,అసిస్టెంట్ గవర్నర్ డా, యం. జైపాల్ రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్, అరవింద్, డా, గీరెడ్డి రవీందర్ రెడ్డి లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రోటరీ సెక్రెటరీ ఎస్. కృష్ణ హరి, ట్రెజరీ వెంకట రమణ, నాగభూషణం, దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now