ఆంధ్ర హాస్పిటల్స్, విశాఖపట్నంలో ఉచిత పిల్లల గుండె ఆపరేషన్లు.

IMG 20240804 WA0078

ఆంధ్ర హాస్పిటల్స్ విశాఖపట్నం మరియు హీలింగ్ లిటిల్ హార్ట్స్, యుకె చారిటీ కలిసి ఉచిత పిల్లల గుండె ఆపరేషన్లు ఆగష్టు 5 నుంచి 7 వరకు చేయనున్నారు. డాక్టర్ రేవంత్, కార్డియాక్ సర్జన్, డాక్టర్ విక్రమ్ పిల్లల కార్డియాలిజిస్టు ఆధ్వర్యంలో ఆంధ్ర హాస్పిటల్స్ కార్డియాక్ టీమ్, ఇంగ్లాండ్ నుండి వచ్చిన డాక్టర్స్ టీంతో కలిసి ఈ క్యాంపును చేయనున్నారు.ఈ క్యాంపులో క్లిష్టమైన పిల్లల గుండె ఆపరేషన్లు చేయనున్నారు. ఇప్పటి వరకు 30 క్యాంపులు విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ లో విజయవంతంగా చేశారు. 4000 గుండె ఆపరేషన్లు మరియు ఇంటర్వెన్షన్స్ చేసిన అనుభవంతో మొదటిసారిగా ఇప్పుడు విశాఖపట్నంలో చేస్తున్నారు.పిల్లలకి గుండె జబ్బులు ఉన్న తల్లిదండ్రులు, పిల్లల డాకర్లు దగ్గర ఉన్న గుండె జబ్బులున్న పిల్లలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, ఇతర సమాచారం కోసం ఈ 8886679733 /08912724777 నంబర్స్ కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని పత్రికాముఖంగా డాక్టర్ పి. వి. రామారావు, చీఫ్ ఆఫ్ చిల్డ్రన్స్ సర్వీసెస్ మరియు డైరెక్టర్, ఆంధ్ర హాస్పటిల్స్ తెలియచేశారు..

Join WhatsApp

Join Now