మోటాట్ పల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం

*మోటాట్ పల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం* భిక్కనూరు మండలం మోటాట్ పల్లి గ్రామంలో గ్రామంలో తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వ హించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ అనిల్ రెడ్డి మాట్లాడుతూ రైతులు అందరూ ఈ వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆవులు గేదెలు ఏవైనా కట్టనిచో వాటిని పరీక్షించి గర్భకోశ వ్యాధులకు తగిన చికిత్స అందించడం జరిగింది మరియు లింగ నిర్ధారిత వీర్యము గురించి కూడా అవగాహన కల్పించారు. ఈ లింగ నిర్ధారిత వీర్యము వాడడం వలన 90% ఆడదూడలు మాత్రమే జన్మిస్తాయని తెలిపారు దీనికిగాను రైతు వాటా 250 రూపాయలు చెల్లించాలని తెలిపారు. ఒకే పశువుకు వరుసగా రెండు ఎదలలో లింగ నిర్ధారిత వీర్యము వాడిన చూలు కట్టకపోతే రైతు వాటా 500 రూపాయలు రైతు అకౌంట్ కు వాపస్ ఇవ్వబడును. ఈ శిబిరంలో దాదాపు 25 గేదెలు 8 ఆవులకు చికిత్స చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో EO DLDA dr. అబ్దుల్ మాజీద్ నిజామాబాద్, Tadwaiపశువైద్యాధికారి డాక్టర్ Ramesh,DLDA సూపర్వైజర్ కృష్ణ మరియు పాల కేంద్రం , సిబ్బంది , గోపాల మిత్రులు Suresh, staf: bharat , Sandeep మరియు రైతులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment