స్వాతంత్ర్య సమరయోధుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్: జిలా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): “రాష్ట్రీయ ఐక్యత దినోత్సవం”ను పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి జిలా ఎస్పీ పరితోష్ పంకజ్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సిబ్బందితో ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్య సమరయోధులు, మొదటి భారత ఉప ప్రధాన మంత్రి, యూనియన్ హోమ్ మంత్రి, గొప్ప నాయకత్వ లక్ష్యాలు ఉన్న వ్యక్తి అని, స్వాతంత్ర్యం అనంతరం 565 సంస్థానాలుగా ఉన్న భారత దేశాన్ని ఆయన పోరాట పఠిమతో ఒక్కటిగా కలిపి “ఐక్య భారతదేశం”గా రూపొందించారని తెలిపారు. దేశ ఐఖ్యతలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ కృషికి ఆయనకు “భారత బిస్మార్క్” అనే బిరుదు లభించిందని అన్నారు. 1928లో బార్డోలీ రైతాంగ ఉద్యమం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అక్కడి రైతులు పన్నులు చెల్లించకుండా, అహింసాత్మకంగా పోరాటం చేయడంతో వల్లాభాయ్ పటేల్ నాయకత్వంలో ఆ ఉద్యమం విజయవంతమైందని, వల్లభాయ్ పటేల్ నాయకత్వ లక్షణాలను మెచ్చి మహాత్మా గాంధీ ఆయనకు “సర్ధార్” అనే బిరుదును ఇచ్చాని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ తో మన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక అనుబంధం వుందని, 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.. కానీ తెలంగాణ రాష్ట్రం నిజాం నిరంకుశ పాలనలో ఉండేదని, సర్ధార్ వల్లభాయ్ పటేల్ పోరాట పఠిమతో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ సంస్థానం భారత దేశంలో విలీనం కావడం జరిగిందని తెలిపారు. వందలాది సంస్థానాలను ఒక్కటి చేసిన మహనీయుడికి ఘననివాళులు అర్పిస్తూ.. జాతీ సమైక్యతకు పునరంకితమై మాతృదేశానికి మన వంతు సేవ చేయడమే స్వాతంత్ర్య సమరయోధులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావ్, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, ఏఆర్ డీఎస్పీ నరేందర్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి కళ్యాణి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్.బి ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఇన్స్పెక్టర్స్ సదా నాగరాజు, ప్రవీణ్ రెడ్డి, నాగేశ్వర్ రావ్, ఆర్.ఐ.లు రామారావ్, రాజశేఖర్, డానియోల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment