స్వేచ్ఛ ఇకలేదు…

స్వేచ్ఛ ఇకలేదు…

జర్నలిజంలో ఎంతో మంచి యాంకర్ గా పేరు తెచ్చుకున్న స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం .. తెలంగాణా ఉద్యమంలో పోరాడిన జర్నలిస్ట్ ఆమె .. పీడిత జనం స్వేచ్ఛ కోసం తన అక్షరాయుధంతో యుద్ధం చేసిన ధీర వనిత ..

ప్రముఖ ఛానెల్లో పని చేస్తున్నపుడు ఆ

ఛానెల్ ని తెలంగాణలో నిలిపివేస్తే ..ఏకంగా ఢిల్లీ వెళ్లి అప్పటి సీఎం ఇంటిముందు ధర్నా చేసిన గొప్ప జర్నలిస్ట్ .. కానీ ఒక నీచుడి వేధింపుల కారణంగా .. ఆమె ఆ ఛానెల్ లో మంచి పొజిషన్ ని వదులుకుని బయటకు రావాల్సి వచ్చింది .. తన కెరీర్ ని ఆ దుర్మార్గుడు నాశనం చేసాడని ఎన్నోసార్లు బాధపడింది ..ఆ

తర్వాత తన కెరీర్ కోసం ఎంతో పోరాటం చేసింది .. ప్రస్తుతం టీన్యూస్ లో ఎంతో మంచి పొజిషన్ కు చేరుకుంది

ఎప్పుడూ చిన్నారి పాపభవిష్యత్తు కోసం ఆలోచించే స్వేచ్ఛ ఇప్పుడు ఆ పాపని తల్లి లేకుండా చేసి ఎందుకు వెళ్ళిపోయిందో అర్ధం కావడం లేదు ..

జర్నలిజాన్ని ప్రాణంగా భావించే స్వేచ్ఛ .. ఇక లేదంటే నమ్మలేకపోతున్నాను .. ఇది నిజం కాదు అబద్ధం అయితే బావుండు అని కోరుకుంటున్నాను .. అందరికీ ధైర్యం చెప్పే నువ్వు ప్రాణం తీసుకున్నావంటే నమ్మబుద్ధి కావడం లేదు .. ఏదో బలమైన కారణమే ఉంది నీ మరణం వెనుక ..

స్వేచ్ఛకు జోహార్లు ..స్వేచ్ఛకు కన్నీటి నివాళి .. విప్లవ జర్నలిస్టుకి వీడ్కోలు ..

Join WhatsApp

Join Now

Leave a Comment