*స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం*
*పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం*
*జమ్మికుంట మార్చి24 ప్రశ్న ఆయుధం*
ఏన్ని దేశాలు తిరిగిన ఎన్ని రాష్ట్రాలు తిరిగిన దొరకనిది స్నేహబంధమని స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ 2010 -11 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం జమ్మికుంట మండలంలోని తనుగుల గ్రామంలో సుమారు 15 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకొని ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆదివారం కలుసుకొని ఒకరికొకరు ఆలింగలనం చేసుకొని ఆత్మీయత పంచుకొని ఆనందంగా గడిపారు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారో తెలియదు ఊరుకోకరు ఉద్యోగరీత్యా, కుటుంబ బాంధవ్యాల రిత్యా బాధ్యతతో సతమతమయ్యే మిత్రులంతా 15 సంవత్సరాల తర్వాత కలుసుకొని ఒకరి బాధలు ఒకరు కష్టసుఖాలు తెలుసుకున్నారు. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ కేరింతలు కొడుతూ ఆటపాటలతో డ్యాన్సులతో అదరగొట్టేశారు. జన్మనిచ్చినది తల్లిదండ్రులైతే తప్పుడు మార్గంలో నడవకుండా బెత్తముతో దండించి తలపై మొట్టికాయలు వేసి విద్యాబుద్ధులు నేర్పిన సమాజంలో మంచి మార్గంలో నడవడానికి మార్గం చూపెట్టి జీవితానికి అర్థం చెప్పిన అప్పటి గురువుల (ఉపాధ్యాయుల) అడ్రస్ తెలుసుకొని స్కూలుకు రప్పించుకొని శాలువాతో సత్కరించి, జ్ఞాపికలు అందజేసి విద్యార్థులంతా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకొని ఆడిన ఆటలు ,పాడిన పాటలు చిలిపి చేష్టలు గుర్తుచేసుకొని ఆనందంగా గడిపారు. చదివిన స్కూల్ రూమ్స్ పాఠశాల ఆవరణ కలియచూసుకొని మురిసిపోయారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రౌతు సంపత్ కుమార్ ,ఆకిన పెళ్లి వెంకటేశ్వర్లు, మంగళపల్లి సంపత్, తిరుపతి, సమ్మయ్య,మారేపల్లి విజయ కుమారి, భాగ్యలక్ష్మి, రమాదేవి పూర్వ విద్యార్థులు జక్కె స్పందన, చెట్టి అనూష, భూపతి స్వాతి, రావుల దివ్య ,పుప్పాల మధుకర్ మాట్ల లవీశ్వర్ ప్రశాంత్ రాకేష్ సురేష్ సాగర్ ప్రవీణ్ హరీష్ లింగమూర్తి సృజన మౌనిక తేజశ్రీ సునీత శిరీష రమాదేవి మాలతి మురళి దేవేందర్ రమణ తదితరులు పాల్గొన్నారు.