గత 50 ఏళ్లుగా త‌న‌తో స్నేహం..

గత 50 ఏళ్లుగా త‌న‌తో స్నేహం కొనసాగించిన ఏడుగురు స్నేహితులు 70వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వారిని సన్మానించారు. 1972, 1973 సంవత్సరాల్లో ఏర్పడిన స్నేహబంధం ఇప్పటికీ కొనసాగుతున్న నేపథ్యంలో విశాఖపట్నంలో ‘ సప్తతి’ పేరుతో వెంకయ్యనాయుడు దంపతులు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గతజ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఇందులో మిజోరం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు, అట్లూరి అశోక్‌, తుమ్మల రంగారావు, వీరమాచినేని రంగప్రసాద్‌, తిపురనేని జేజీ ప్రసాద్‌, బిక్కిన లక్ష్మణరావు, సూర్యదేవర జోగేంద్రదేవ్‌ ఉన్నారు. అంద‌రూ త‌మ మ‌ధ్య ఉన్న అనుబంధాల‌ను పంచుకొన్నారు. ఈ కార్యక్రమానికి అనుకోని అతిథిగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హాజరయ్యారు. రాడిసన్‌బ్లూ హోటల్‌లో బసచేసేందుకు వెళ్లిన ఆయన.. వెంకయ్యనాయుడు అక్కడే ఉన్నారని తెలుసుకొని ఆయన వద్దకు వెళ్లారు. స్నేహితుల‌తో క‌లిసి భోజ‌నం చేస్తున్న వెంకయ్యనాయుడుని కలిసి అభినందించి వెళ్లారు.

Join WhatsApp

Join Now