వినోదం విషాదంగా మారకూడదు
– జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 31న విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తాం
– నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా జరుపుకోవాలి
*సిద్దిపేట జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 30 ( ప్రశ్న ఆయుధం ):*
జిల్లాలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు పాటించి వేడుకలు జరుపుకోవాలని.. వినోదం విషాదంగా మారకూడదని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ తెలిపారు. రాబోయే నూతన సంవత్సరం సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ అధికారులు ప్రజలకు, పిల్లలకు వారి తల్లిదండ్రులకు సోమవారం తగు సూచనలు చేశారు. మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడిపే వారిపై, బైకులపై త్రిబుల్ రైడింగ్ చేస్తూ, కేరింతలు కొడుతూ ,బైకులను స్నేక్ డ్రైవింగ్ చెస్తూ,తోటి వారికీ ఇబ్బంది కలిగిస్తూ , అశాంతి వాతావరణం కలిగించాలని చూస్తే వారిని గుర్తించి, వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 31న విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. మైనర్ వాహనాలు నడిపి పట్టుబడితే వారి పైన వారి తల్లిదండ్రుల పైన కేసులు నమోదు చేస్తామని చెప్పారు. గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై డాగ్స్ కార్డ్స్ మరియు ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
– అదేవిధంగా రాత్రి రోడ్ల పై కేకులు కట్ చేసినా, డిజే లు పెట్టి డాన్సులు చేసినా, మద్యం సీసాలతో బహిరంగంగా తాగుతూ కనిపించిన వారిపై తగు చర్యలు తీసుకోబడును.
– నూతన సంవత్సరం సందర్భంగ అతి ఉత్సాహం చూపిస్తూ, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ప్రభుత్వ ఆస్తులను కానీ, ప్రజల ఆస్తులని కానీ, ధ్వంసం చేస్తే వారిపై కేసులు మరియు నష్టపరిహారం పై చర్యలుంటాయి
– నూతన సంత్సర శుభాకాంక్షలు చెప్పే క్రమములో అసభ్య సందేశాలు, అసభ్య ఫోటోలు పంపించిన, అసబ్య ఆడియోలు పంపిస్తే వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకొనబడును.
– ఈ నూతన సంత్సర వేడుకలు ప్రశాంత వాతావరణములో జరుపుకొనుటకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పరిధిలో 31 నాడు వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, నిర్వహించడం జరుగుతుంది.
– ఈ నూతన సంత్సర వేడుకలలో భాగంగా తల్లి దండ్రులకు విజ్ఞప్తి ఏమనగా మీమీ పిల్లలతో యుక్తముగా కుటుంబ సమేతముగా ,మి మి ఇళ్లలోనే వేడుక జరుపుకోవాలి. క్షణికా ఆవేశంలో తాత్కాలిగా ఆనందం కోసం చేసిన చర్యల వలన ప్రమాదము జరిగినా అది మీ కుటుంబంలో తీరని దుఃఖం మిగులుస్తుంది మరియు ఏదైనా జరగరానిది జరిగితే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది ఇది గమనించగలరు.
– మైనర్ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వవద్దు.
– ఒకరోజు ఆనందానికి భవిష్యత్తు అందాకారం చేసుకోవద్దు.
– వేడుకలు ప్రశాంతంగా జరగడానికి ప్రజలందరూ సహకరించాలి.
– న్యూ ఇయర్ వేడుకల్లో డీజేలు నిషేధించడం జరిగింది, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే సిజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం*
– మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమించేవారిని గుర్తించేందుకుగాను ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రధాన రోడ్డు మార్గాలు మరియు ఇతర రోడ్డు మార్గాలపై పోలీస్ బృందాలచే ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని సీపీ తెలిపారు.