డిజిటల్‌ కార్డుల జారీకి కార్యాచరణ..

కుటుంబ డిజిటల్‌ కార్డుల జారీకి కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. డిజిటల్‌ కార్డులపై మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కుటుంబ డిజిటల్‌ కార్డుల జారీ కోసం ప్రతి నియోజకవర్గంలోని ఒక పట్టణం, ఓ గ్రామంలో పైలట్‌ ప్రాజెక్టు చేపట్టాలని రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. 

‘వన్‌ స్టేట్‌.. వన్‌ డిజిటల్‌ కార్డు’ విధానం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రేషన్‌, ఆరోగ్య సేవలతోపాటు సంక్షేమ పథకాలన్నీ ఒకే కార్డు ద్వారా అమలు చేసేలా ప్రణాళిక చేస్తోంది. కుటుంబ డిజిటల్‌ కార్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా సంక్షేమ పథకాలు పొందేలా ప్రణాళికలు వేయాలని సీఎం సూచించారు. డిజిటల్‌ కార్డులో కుటుంబ సభ్యులందరి హెల్త్‌ ప్రొఫైల్‌ పొందుపరిచి, దాని ద్వారానే ఆరోగ్య సేవలు అందించాలన్నారు. అర్హులందరికీ కుటుంబ డిజిటల్‌ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని, దీని కోసం జిల్లాల వారీగా ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సీఎం సూచించారు. రాజస్థాన్‌, హరియాణా, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేయాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

Join WhatsApp

Join Now