Site icon PRASHNA AYUDHAM

జుక్కల్ లో కొత్త రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు

IMG 20250703 WA2516

జుక్కల్ లో కొత్త రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు

కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్, జుక్కల్ ఆర్సీ (ప్రశ్నఆయుధం)జూలై 03

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రాష్ట్ర రోడ్లు & భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో భేటీ అయ్యారు.జుక్కల్ నియోజకవర్గంలోని రోడ్ల దుస్థితి గురించి మంత్రి కి వివరించి గ్రామాలకు కొత్త రహదారుల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరగా.మంత్రి తక్షణమే స్పందించి 32.20 కోట్ల రూపాయలు మంజూరు చేయడమే గాక,పనుల ప్రారంభోత్సవానికి మంత్రి ఈ నెల 7 వ తేదీన నియోజకవర్గానికి వస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ ప్రజల పక్షాన మంత్రి కి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కృతజ్ఞతలు తెలియజేశారు.

Exit mobile version