ఎస్సీ ఎస్టీ దామాషా ప్రకారం నిధులు కేటాయించాలి!!

కేంద్ర,రాష్ట్ర బడ్జెట్ లను సవరించి ఎస్సీ ఎస్టీ జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలి

డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్

సిద్దిపేట జూలై 31 ( ప్రశ్న ఆయుధం ) :

కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ లను సవరించి ఎస్సీ ఎస్టీ ల జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు. బుధవారంనాడు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ లను సవరించి పెంచాలని డిమాండ్ చెస్తూ దళిత సంఘాలు నిరసన ప్రదర్శన చేసారు. ఈ సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ 2024-25 ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ లలో ఎస్సీ ఎస్టీ ల జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్య,వివక్షను పాటించరన్నారన్నారు.చేవెళ్ళ డిక్లరేషన్ లో ఎస్సీ ఎస్టీ లకు హమి ఇచ్చినపధకాలకు నిధులు కేటాయించలేదన్నారు. దళిత బంధు స్ధానం లో అంబేద్కర్ భరొసా పధకాన్ని ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి 12 లక్షల ఆర్ధిక సహయం అందజెస్తామన్నప్పటికి బడ్జెట్ లో ప్రస్తావించలేదన్నారు.గత సంవత్సరం కన్నా 1800 కోట్ల ను తగ్గించి బడ్జెట్ కేటాయించారన్నారు.కౌలు రైతులకు రైతు భరోసా పథకం అమలుకు ఎటువంటి నిధులు కేటాయించలేదన్నారు. ఈ కార్యక్రమం లో డిబిఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.నరిసింహ్మ, తిరుపతి,కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు బాలుపిర్,డిబిఎఫ్ రాష్ట్ర నాయకులు పులి కల్పన, దాసరి ఎగొండ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now