SC వర్గీకరణ తీర్పు పరంపరలో 8 వ మరియు చివరి విశ్లేషణ భాగం. ఇదే చివరి విశ్లేషణ, కథనం, వ్యాసంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులు గుర్తించగలరు, గమనించగలరు.నిజానికి భారతదేశం ప్రపంచంలో అన్నిరంగాలలో నెంబర్ వన్ స్ధానంలో వుండాలని కలలుగన్న.. మహత్తరమైన, మహోన్నతమైన వ్యక్తి, శక్తి.. ఈ భూప్రపంచంలోఎవరైనా వున్నారు అంటే.. అది ఒకేఒక్క.. మన అయ్య, మన మాస్టర్.. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, భారత జాతి ముద్దుబిడ్డ, బాబాసాహెబ్ Dr.B.R. AMBEDKAR గారు అంటే.. ఎటువంటి అనుమానం, సందేహం, అతిశయోక్తిలేదు. ఆ మహనీయుని ఆలోచనలు ఎంత విశాలం, విస్తృతం.. అద్భుతం, అపారం, అమోఘం అంటే.. చెప్పనలవికానివి, వర్ణించజాలనివి.భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల,18 రోజుల పాటు అహోరాత్రులు శ్రమించి, కష్టపడి, నిద్రాహారాలు సైతం సమృద్ధిగా, చాలినంత అందిపుచ్చుకొనక.. అరకొరగా, నామమాత్రంగా తీసుకొని.. ప్రపంచంలో ఎవరూ చేయనంత త్యాగం, మహాత్యాగం.. తన భార్య సహా 4 బిడ్డలను “రక్తహీనత, పౌష్టికాహారలోపం”తో.. ఒకపక్క వరుసగా బిడ్డలు సహా భార్య చనిపోతున్నా, నేలకొరుగుతున్నా.. తన ఆరోగ్యం కూడా అంతంతమాత్రమే సహకరిస్తున్నా.. ఏమాత్రం అదరక, బెదరక, వెరవక, లెక్కచేయక.. మొక్కవోనిఆత్మవిశ్వాసంతో, మొండిపట్టుదల, కృషి, ధృడసంకల్పం, మనోనిబ్బరం, గుండెధైర్యం, గుండెనిబ్బరంతో.. పట్టువదలని విక్రమార్కుడిలా తనకు అప్పగించిన రాజ్యాంగ రచనా భారాన్ని.. సమర్థవంతంగా నిర్వహించి.. 395 ఆర్టికల్స్, 12 భాగాలు, 22 విభాగాలతో ప్రపంచంలోనే నెంబర్ వన్ రాజ్యాంగాన్ని, మన భారతదేశానికి అందించి.. మంచి సమర్థపాలకులచే.. ఉన్నత, అత్యున్నత, మహోన్నత ఉద్దేశాలు, లక్ష్యాలు గొప్పగా సాధించబడాలని, నెరవేర్చబడాలని.. అప్పటికే వేళ్లూనుకొనివున్నా అస్పృశ్యత, అంటరానితనం, అణిచివేత, దోపిడీ, వివక్ష సహా ఆధిపత్యం, భూస్వామ్య, పెట్టుబడిదారీ, పెత్తందారీ స్వభావం, గుణం, వ్యక్తిత్వం, మనస్తత్వం, తదితర అరాచక గుణగణాలు.. దారుణాలు , దుర్మార్గాలు పూర్తిగా సమిసిపోయి.. ఒకానొకరోజుకు అందరూ సమానమేనన్న “ప్రజాభావన” సాధించేందుకు.. 26 నవంబర్ 1949 న జాతికి అంకితంచేసి.. సరిగ్గా రెండు నెలలకు 26 జనవరి 1950 న అమలులోకి వచ్చేలా విశేషకృషి చేసిన విషయం అందరికి విదితమే.అంతకు ముందురోజు “రాజ్యాంగసభ” చివరిరోజు 25 నవంబర్ 1949 న మహనీయ అంబేద్కర్ సాహెబ్ చేసిన చారిత్రక ప్రసంగం.. రేపటి నుంచి “వైవిధ్య, వైరుధ్య” భరితమైన సమూహం, సమాజంలోకి అడుగిడబోతున్నాం.. ఒకే మనిషి, ఒకే ఓటు మరియు ఒకే విలువ/One MAN, One VALUE and One VOTE ఆన్న ప్రజాస్వామిక ప్రాతిపదికన అప్పట్లో 21 సంవత్సారాలు, నేడు 18 సంవత్సారాలు నిండిన ప్రతివయోజనుడికి ఓటు హక్కు కల్పించడం ద్వారా.. రాజకీయ ప్రజాస్వామ్యం అయితే.. కొద్దోగొప్పో సాధించగలిగాం. కానీ, సామాజిక, రాజకీయ ప్రజాస్వామ్యం మాత్రం అలాగే మిగిలిపోయాయని.. వాటిని కూడా నిర్ధిష్టకాలపరిమితిలోపు సాధించగలిగితేనే.. ఈ రాజకీయ ప్రజాస్వామ్యానికి అర్ధం, పరమార్థం వుండగలదని ఆనాడే,75 సంవత్సరాల కిందటే, ఆ మహానుభావుడు యావత్ జాతికి సూచించిన, విన్నవించిన, హెచ్చరించిన పరిస్థితి, చరిత్ర. అంతేకాకుండా.. ఇంకా అనేక అంశాలపై తనకున్న ఆలోచనలను, భావనలను, భావాలను నిర్మోహమాటంగా, నిర్భయంగా కుండబద్ధలుకొట్టినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.ఆ రాజ్యాంగ సభలో ఇంకా.. ఈ రాజ్యాంగం ఎంత మంచిధైనప్పటికీ.. అమలుచేయువారు అర్హులు , యోగ్యులు, సమర్థులు కాకపోతే.. ఇది చెడుఫలితాన్ని ఇస్తుంది. ఈ రాజ్యాంగం ఎంత చెడ్డదైనప్పటికి.. అమలుచేయువారు అర్హులు, యోగ్యులు, సమర్ధులు అయితే.. ఇది మంచిఫలితాలనే ఇస్తుందని అధ్బుతంగా వివరించిన, విశ్లేషించిన గొప్ప మానవతావాది.ఇంతగొప్ప ముందుచూపు, దూరదృష్టి కలిగిన వ్యక్తి రచించిన, నిర్మించిన భారత రాజ్యంగాన్ని.. ఎందుకు పాలకులు, ఈ రాజ్యాంగాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించే ప్రయత్నం అడుగడుగునా చేస్తున్నట్లు? ప్రజలు, ఈ రాజ్యాంగానికి సహకరించకుండా, కట్టుబడకుండా.. ఎందుకు చేస్తున్నట్లు? ఇలా అన్ని రాజ్యాంగ స్వతంత్ర సంస్థలను, వ్యవస్థలను.. “భ్రష్టుపట్టించే, నిర్వీర్యంచేసే, బలహీనపరిచే” చర్యలకు, పనులకు, కార్యక్రమాలకు ఎందుకు పూనుకుంటున్నట్లు, వడిగడుతున్నట్లు?. ఇంతకూ పాలకుల ఉద్ధేశం, అంతరంగం, మనోగతం ఏమైవుండొచ్చు?.ఈ దేశాన్ని.. ఏం చేయాలనుకుంటున్నారు, ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇంతకీ నాటి నుంచి, నేటివరకు పాలించిన, పాలిస్తున్న పాలకులలో స్పష్టమైన స్పృహ, అవగాహన, ఆలోచన, చైతన్యం, పరిణతి వుందా? వుంటే.. ఎందుకు న్యాయవ్యవస్థతో ఇలాంటి తీర్పులు ఇప్పిస్తునన్నట్లు?.ఇంతకూ న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తున్నట్లేనా !? నిజంగా స్వతంత్రంగా పనిచేస్తున్నట్లయితే.. భిన్నమైన, అశాస్త్రీయ, అసంబద్ధ తీర్పులు ఎందుకిస్తారు, ఇప్పిస్తారు? ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్నోతీర్పులు.. ముఖ్యంగా 2018 SC, ST హత్యాచార నిరోధకచట్టం, పదోన్నతులలో ప్రాతినిధ్య విషయం, EWS వర్గాల ప్రాతినిధ్య అంశం, మహిళా బిల్లుకు సంబంధించిన చట్టం. తాజాగా భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని 7 మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన వర్గీకరణ తీర్పు సహా సామాజిక న్యాయం, సామాజిక ప్రజాస్వామ్యం, సమానత్వం, సమాన ప్రాతినిధ్యంకు సంబంధించిన అనేక తీర్పులు, చట్టాలు వివాదాస్పదం అయ్యాయంటే.. దానికి కారకులు ఎవరు?. పాలక ప్రభుత్వం.. “భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని” బలహీనపరిచే అనైతిక, అనాగరిక, అప్రజాస్వామిక చర్యలు సహా కుట్రలు, కుతంత్రాలు, మోసాలకు దిగినట్లుగా అర్ధం చేసుకోవచ్చా!?.ఇలాంటి చర్యలు, పనులు, తీర్పులతో రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించే బృహత్తర “పథకాన్ని” ఏమైనా రచించారా? ఇంతకూ మనువాదుల ఉద్ధేశం ఏమైవుండొచ్చు?.కేంద్ర ప్రభుత్వం నేరుగా చేయలేనిపనిని.. కోర్టులను , న్యాయవ్యవస్థను అడ్డుపెట్టుకొని.. “రాజకీయ, రాజ్యాంగ” సంక్షోభాలను సృష్టించేందుకు భారీ కుట్ర జరుగుతోందా?.ఇప్పుడున్న రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి, అధికారం, హక్కు.. ఈ పార్లమెంటుకు లేదని.. ఉన్నదల్లా ఆర్టికల్ – 368 ద్వారా పరిమిత అధికారాలతో రాజ్యాంగ సవరణకు మాత్రమే అంగీకరిస్తున్న, అనుమతిస్తున్న మూలంగా, కారణంగా.. కోర్టుల ద్వారా లోపభూయిష్ట, తప్పులతడక, అనాలోచిత, అస్తవ్యస్త, వివాదాస్పద తీర్పులతో.. మొదట ప్రజలు, ప్రజాస్వామ్యం ఓడిపోయేలాచేసి, తీవ్ర సంక్షోభాన్ని సైతం సృష్టించి.. తద్వారా, ఈ రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరణకు గురిచేసి, చేయించి.. ప్రజలు కూడా, ఈ రాజ్యాంగానికి సహకరించకుండా చేసి.. మూడంచెల వ్యూహంతో రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించాలనే దారుణ, దుర్మార్గ, అన్యాయ ఆలోచన ధోరణి, వైఖరితో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది, తెలుస్తొంది.కాబట్టి.. భారతదేశ ప్రజలమయిన మనం.. విజ్ఞతను, వివేకాన్ని.. ఉన్నతంగా, అత్యున్నతంగా, మహోన్నతంగా ప్రదర్శించి.. మనువాద భావజాల కుట్రలు, కుతంత్రాలు, మోసాలను ధీటుగా, ధాటిగా ఎదుర్కొందాం, సమర్థవంతంగా తిప్పికోడుదామని ఈ సందర్భంగా యావన్మంది ప్రజలు, ప్రజాస్వామిక వాదులకు చేతులుజోడించి, శిరస్సువంచి “జైభీములు మరియు బుద్ధవందనాలు” చెల్లిస్తున్న హుందాగా,గౌరవంగారండి.. మనువాదుల “”కుట్ర సిద్ధాంతాలను, విరుగుడు సిద్దాంతం””తో రాజ్యాంగ సంక్షోభాన్ని అడ్డుకుందాం, నిలువరిద్ధాం.. రాజ్యాంగాన్ని మార్చాలన్న దుర్భుద్ధి, దుర్నితి సహా నీచ్చనికృష్ట.. హీనహేయ చర్యలను తీవ్రంగా ఖండిద్దాం.. ప్రజల ముందర కూడా ఉంచుదాం….నూతన ప్రజాస్వామిక విప్లవ జైభీములతో….సంగటి మనోహర్ మహాజన్,వ్యవస్థాపక జాతీయ సమన్వయకర్త,రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి..రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుందాం….
Latest News
