బాల్యం నుండే భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి
వ్యక్తిత్వ వికాస నిపుణులు తుమ్మ కృష్ణ
సిద్దిపేట ఆగస్టు 7 ప్రశ్న ఆయుధం :
రోటరీక్లబ్ ఆఫ్ గజ్వేల్ సెంట్రల్ ఆధ్వర్యంలో మర్కుక్ మండల కేంద్రం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్ సెంట్రల్ అధ్యక్షులు తుమ్మ కృష్ణచే విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బాల్యం నుండే భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, దాని కోసం యుద్దాలు చేయాల్సిన అవసరం లేదనీ, కేవలం మన మనస్సు నిగ్రహించి ఉన్నత లక్ష్యంపై గురి పెట్టాలని అన్నారు. బాల్యం నుంచే ఉన్నత శిఖరాలకు పోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు సాగాలన్నారు. మంచి ఆలోచనలు మానవ జీవితాన్ని తీర్చిదిద్దబడతాయి అన్నారు. ఉత్తమ అలవాటులను పెంపొందించుకొని, ఉన్నత శిఖరాలకు నమ్మకంతో ముందడుగు వేస్తే మనం కన్న కలలు వాస్తవ రూపం దాల్చబడతాయి అన్నారు…
ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ ఓ భాగ్య లక్ష్మి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.