తెలంగాణ పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గడ్డం చంద్ర శేఖర్ రెడ్డి
– కామారెడ్డి లో కాంగ్రెస్ సంబరాలు
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

తెలంగాణ పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గడ్డం చంద్ర శేఖర్ రెడ్డి నియామాకం అయిన సందర్బంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో సంబరాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజాంసాగర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి, స్వీట్స్ పంచుకుని సంబరాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకు, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇంచార్జి మీనాక్ష నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు పాత శివకృష్ణ మూర్తి, పంపరి శ్రీనివాస్, చాట్ల వంశీ కృష్ణ, సలీమ్, సాయిబాబ, మహేష్, రాంమోహన్, జూలూరి సుధాకర్, సుగుణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గ్యార సాయిలు, కాంగ్రెస్ నాయకులు, క్రెడా సభ్యులు, సూర్య బాయ్ యూత్, జీసీఆర్ యువసేన సభ్యులుతదితరులు పాల్గొన్నారు.
Post Views: 8