హనుమాన్ గుడి పునర్నిర్మాణానికి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి 50 వేల విరాళం

హనుమాన్ గుడి పునర్నిర్మాణానికి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి 50 వేల విరాళం

పేద ప్రజల సేవే నా ధ్యేయం – టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ( ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 25

 కామారెడ్డి జిల్లా టేక్రియాల్ గ్రామంలో హనుమాన్ గుడి పునర్నిర్మాణ పనుల కోసం టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి రూ.50,000 విరాళం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజల సేవే తన ధ్యేయమని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని అన్నారు. హనుమాన్ గుడి అభివృద్ధి కోసం తన వంతు సహకారం ఎల్లప్పుడూ కొనసాగిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు జాదవ్ శంకర్ రావు, ఊరుదొండ వనిత రవి, పంపరి శ్రీనివాస్, జూలూరి సుధాకర్, పిడుగు సాయిబాబా, సలీం, చాట్ల వంశీ, మామిళ్ళ రమేష్, రంగ రమేష్, నర్సూర్ల మహేష్, కుంటి ఆంజనేయులు, లింగం శివ, పీ.కిష్టయ్య, పి.శ్రీనివాస్, ఆంజనేయులు, పండు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment