Site icon PRASHNA AYUDHAM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నూతన సంవత్సరం సందర్భంగా కలిసిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

IMG 20260101 WA0041

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నూతన సంవత్సరం సందర్భంగా కలిసిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

మరియు తాజా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ 

శాలువాతో సన్మానం… సంక్షేమం–అభివృద్ధిపై సీఎం సూచనలు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం జనవరి 01 

హైదరాబాద్, జనవరి 1 (2026): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ గురువారం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రివర్యులను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణను సకల జన సంక్షేమ రాష్ట్రంగా, సమస్త అభివృద్ధికి కేంద్రంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఆదర్శంగా నిలబెట్టేందుకు నాలుగు కోట్ల ప్రజల సహకారంతో నవ వసంతాల తెలంగాణ గొప్ప విజయాలను సాధించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా కామారెడ్డి పట్టణ ప్రజలకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే దిశగా కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులు ప్రజలకు చేరుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రివర్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ పాల్గొన్నారు.

Exit mobile version