ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
ఉక్కు మహిళ సేవలు నేటికీ స్ఫూర్తిదాయకం
కామారెడ్డిలో ఘనంగా నివాళి కార్యక్రమం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 31
భారతదేశ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పణ కార్యక్రమం జరిగింది. టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశపు కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆమె రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దిన దృష్టాంత నాయకురాలని కొనియాడారు.
ఇందిరాగాంధీ దేశానికి అందించిన నిరుపమాన సేవలు నేటితరం నాయకులకు సైతం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి దిశగా బ్యాంకుల జాతీయీకరణ, జమీందారీ వ్యవస్థ రద్దు, “గరీబీ హఠావో” వంటి విప్లవాత్మక పథకాలతో భారతదేశాన్ని కొత్త దిశలో నడిపించారని గుర్తుచేశారు.
ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ధైర్యం, అంకితభావానికి ప్రతీకగా నిలిచిన ఇందిరా గాంధీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు శంకర్‌రావు, జూలూరి సుధాకర్, సాయిబాబా, మామిళ్ల రమేష్, మహేష్, తాటి ప్రసాద్, రంగ రమేష్, నర్సిల్ల మహేష్, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.