సర్దార్ పటేల్ చిత్రపటానికి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నివాళి
దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ధీరసాలికి ఘన నివాళులు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 31
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ,సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఐక్యతే అసలైన స్వాతంత్ర్యమని నమ్మిన సాహసోపేత నాయకుడు సర్దార్ పటేల్ గారు తన దూరదృష్టితో దేశాన్ని ఏకం చేసిన ధీరసాలి అని అన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు శంకర్ రావు, జూలూరి సుధాకర్, సాయిబాబా, మామిళ్ల రమేష్, మహేష్, తాటి ప్రసాద్, రంగ రమేష్, నర్సిల్ల మహేష్, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.