ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గడ్డం రవికుమార్ 

ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గడ్డం రవికుమార్

మేడ్చల్, జనవరి

ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ కార్యదర్శి, రాష్ట్ర యువ కాపునాడు వైస్ ప్రెసిడెంట్ గడ్డం రవికుమార్ సంబరాల్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినీ ఆటోగ్రాఫ్ మంత్రి కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సంక్రాంతి సందర్భంగా జరిగే సంప్రదాయ కోడి పందాల్లోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్డం రవికుమార్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతి పర్వదినాన్ని సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. చిన్నపిల్లలు పతంగులు ఎగరవేసినప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వ బాబు యాదవ్, రాజు యాదవ్, కే. రాజేష్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now