గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు..

*గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు..*

*హైదరాబాద్*

గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు సినీ నిర్మాత దిల్ రాజు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో .. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు.. జూన్ 14న భారీ స్దాయిలో ఈ అవార్డుల వేడుక జరగనుంది. మంగళవారం నుంచి జ్యూరీ సభ్యులు సినిమాలను చూసిన అనంతరం ఎంపిక చేస్తారు. ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి మాట్లాడుతూ.. జూన్ 14న హైటెక్స్‌లో గద్దర్ అవార్డుల వేడుకను జరపనున్నట్లు చెప్పారు. తెలంగాణా రాష్ట్రంలో మొదటిసారిగా గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తున్నామని చెప్పారు.

భట్టి విక్రమార్క మాట్లాడుతూ..

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా జరగనున్న అవార్డుల వేడుకని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దురదృష్టం .. దశాబ్దకాలంలో ఎలాంటి అవార్డులు పోత్సాహకాలు సినీ పరిశ్రమ చూడలేకపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమను ప్రోత్సహించిందని, ఎక్కడో ఉన్న సిని పరిశ్రమను ఇక్కడకు తీసుకురావటం.. ఫిలింనగర్ ఏర్లాటు.. కార్మికులకు హౌసింగ్‌‌కు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు. విలువలతో కూడిన సమాజ నిర్మాణం కోసం తనవంతు కృషి చెస్తున్నానని, సినిమా పరిశ్రమను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని సిఎం రేవంత్ రెడ్డి గద్దర్ చలనచిత్ర అవార్డులను ఇవ్వాలని నిర్ణయించారని భట్టి విక్రమార్క అన్నారు.

ఎన్ని విమర్శలు వచ్చినా..‌

గద్దర్ తెలంగాణా సంస్కృతి భావాజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారని, ఒక శతాబ్దానికి ఓ మనిషి అలాంటివారు పుడతారని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్బావానికి గద్దర్ తన పాటలతో కృషి చేశారని కొనియాడారు. అలాంటి వ్యక్తి పేరు మీద అవార్డులు ఇస్తున్నామన్నారు. గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం గురించి అందరూ గొప్పగా మాట్లాడుకోవాలని.. అందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని చెప్పామన్నారు. రాగద్వేషాలకు అతీతంగా ట్రాన్స్‌ పరెంట్‌గా ఉత్తమ సినిమాలను ఎంపిక చేయాలని జ్యూరీ సభ్యులను కోరుతున్నామన్నారు. గద్దర్ పేరుతో ఇచ్చే అవార్డులపై ఎన్ని విమర్శలు వచ్చినా.. ఆయన పేరుపైనే అవార్డులు ఇస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు

గద్దర్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్ పర్సన్ జయసుధ మాట్లాడుతూ..

గద్దర్ తెలంగాణా ఫిలిం అవార్డ్స్ జ్యూరీకు చైర్ పర్సన్‌గా తనను ఎంపిక చేసినందుకు జయసుధ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి, సినీ నిర్మాత దిల్ రాజు ధన్యవాదాలు తెలిపారు. మా జ్యూరీ మెంబర్స్ అందరూ కలిసి ఉత్తమ సినిమాలను ఎంపిక చేస్తామని జయసుధ అన్నారు.

కాగా పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి, దిల్ రాజు, జయసుధ, జ్యూరీ మెంబర్స్.. శ్రద్దాంజలి ఘటించారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం వల్ల మంగళారం విడుదల చేయాల్సిన గద్దర్ అవార్డుల లోగో ఆవిష్కరణ వాయిదా పడింది. త్వరలోనే సీఎం చేతుల మీదుగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు లోగో ఆవిష్కరణ జరుగుతుందని వారు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment