: గద్దర్‌ను హత్య చేశారు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు*
ప్రజా నౌక గద్దర్‌ది ముమ్మాటికి హత్య చేశారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారు. దీన్ని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని చెప్పారు.
గద్దర్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గద్దర్‌పై అనుచితంగా మాట్లాడితే సహించేది లేదంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై ఫైరయ్యారు.
గద్దర్ మరణం పై సిబిఐ విచారణ జరపాలని వ్యాఖ్యలు చేశాడు.
పద్మ అవార్డుల ప్రకటనతో తెలంగాణ ప్రజా గొంతుక గద్దర్ ప్రస్తావన తెరపైకి రావడంతో దీనిపై కేఏ పాల్ స్పందించారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గద్దర్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు.
బండి సంజయ్ అంటున్నట్టుగా గద్దర్ మావోయిస్ట్ మాత్రమే కాదని.. ప్రజల కోసం పోరాడిన మానవతమూర్తని కొనియాడారు.
టెర్రరిస్టులకు పద్మ అవార్డులు ఇస్తున్న బీజేపీ.. మానవతావాది, తెలంగాణ ప్రజా గొంతుకను గౌరవించరా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తెలంగాణ యుద్దనౌక ప్రజా గొంతు క గద్దర్ ను పద్మ అవార్డులతో గౌరవించకుండా అవమానించారని మండిపడ్డారు.ప్రజాశాంతి పార్టీలో చేరినందుకే గద్దర్ కు పద్మశ్రీ అవార్డు దక్కలేదన్నారు.
నిజానికి కేఏ పాల్ ఎంత పెద్ద సంచలన వ్యాఖ్యలు చేసినా లైట్ తీస్కో బ్రదర్ అన్నట్టుగానే చూస్తారు కొందరు జనం. ఇంకొందరు మాత్రం అరే భలే చెప్పాడే కేఏ పాల్ అంటారు. మరీ గద్దర్ మరణంపై కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలపై జనం ఎలా పట్టించుకుంటారో లేదో వేచి చూడాల్సిందే..