Site icon PRASHNA AYUDHAM

యువతను ప్రోత్సహిస్తున్న యువ నాయకుడు….. గాదె శివ చౌదరి

IMG 20250805 WA0049

యువతను ప్రోత్సహిస్తున్న యువ నాయకుడు….. గాదె శివ చౌదరి

ప్రశ్న ఆయుధం ఆగస్టు 05: కూకట్‌పల్లి ప్రతినిధి

మాదాపూర్ లో సోదరుడు మోరంపూడి చెన్నారావు యొక్క నూతన వ్యాపారం మొబైల్ క్యాంటీన్ & టీ పాయింట్ ను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ యువనేత గాదె శివ చౌదరి.

మనిషి మనుగడకు నమ్మకం అనేది ముఖ్యం. నమ్మకం, విలువలతో కూడిన ఏ ఆలోచన, ఏ వ్యాపారమైన ముందడుగు వేస్తుందని తెలియజేసిన శివ చౌదరి. ఈ రోజుల్లో పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకొని మనిషి మనుగడకు ఉద్యోగం ఒకటే సరిపోదు, వ్యాపారం కూడా తప్పనిసరి. మనిషి 24 గంటల్లో ఎక్కువ భాగం కష్టపడటానికి ఇష్టపడాలని, యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన యువ నాయకుడు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నా ఎంఎస్ఎంఈ ముద్ర లోన్స్ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అందించబోతున్న రాజీవ్ యువ వికాసం వంటి వంటి పథకాలు యువతను స్వయం ఉపాధి వైపు నడిపిస్తున్నాయని తెలియజేసిన యువ నాయకుడు. వ్యాపారం వైపు దృష్టి సారించిన యువతను ప్రోత్సహించిన శివ చౌదరి.

ఈ కార్యక్రమంలో నెక్కళ్లపు అన్వేష్,మోరంపూడి నరేష్, బలుసు సతీష్ , సుధీర్, రాము తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version