Headlines
-
గడ్డం వెంకటయ్య మృతి: కళారంగంలో లోటు
-
ప్రసిద్ధ చిందు యక్షగాన కళాకారుడి గతం: గడ్డం వెంకటయ్య
-
తెలంగాణలో కీర్తి గడించిన గడ్డం వెంకటయ్య: శ్రద్ధాంజలులు
దేవరుప్పుల మండలం అప్పిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన ప్రముఖ చిందు యక్షగాన కళాకారుడు గడ్డం వెంకటయ్య ( 56) అనారోగ్యంతో నేడు మృతి చెందాడు. చిందు యక్షగాన కళా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గడ్డం వెంకటయ్యది పూర్వీకుల నుంచి చిందు యక్షగాన కళాకారుల కుటుంబం చిన్ననాటి నుండి ఈ రంగంపై మక్కువ పెంచుకొని పలు రకాల వేషధారణలు వేసి తనదైన శైలిలో వాటిని రక్తి కట్టించాడు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వందల సంఖ్యలో చిందు యక్షప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందాడు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అనేక కళారూపాలలో విస్తృత ప్రచారాలు చేశారు. ఇటీవల వారి కుటుంబం నుండి తన సొంత సోదరుడు గడ్డం సమ్మయ్య పద్మశ్రీ అవార్డు పొంది ఎన్నో ప్రశంసలు పొందిన విషయం తెలిసినదే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళలు, కళాకారులకు అండగా ఉంటుందని గడ్డం సమ్మయ్య గుర్తు చేశారు. గడ్డం వెంకటయ్య మృతి చాలా బాధాకరమని ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయామని పలువురు ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, కుటుంబీకులు గ్రామస్తులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.