Site icon PRASHNA AYUDHAM

వాహనదారున్ని సన్మానించిన గజ్వేల్ ట్రాఫిక్ పోలీసులు

WhatsApp Image 2025 01 11 at 9.02.10 PM

గజ్వేల్ నియోజకవర్గం ప్రతినిధి, 11 జనవరి 2025 : తన వాహనంపై ఉన్న పది పెండింగ్ చాలన్లు తనంతట తాను పోలీస్ స్టేషన్కు వచ్చి చెల్లించినందుకు గజ్వేల్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారున్ని అభినందించి శాలువాతో సన్మానించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా పోలీసులు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలకు ఆకర్షితుడై గజ్వేల్ మండలం బెజగామ గ్రామానికి చెందిన అందే కరుణాకర్ తనంతట తను స్వచ్చందంగా శనివారం ఉదయం గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు వచ్చి తన బైకు మీద ఉన్న పది పెండింగ్ చాలాన్లు రూ. 4145 చెల్లించారు. వాహనదారుడు కరుణాకర్ తనంతట తాను వచ్చి చెల్లించినందుకు గజ్వేల్ ట్రాఫిక్ ఏఎస్ఐ జగదీశ్వర్, సిబ్బంది కలసి శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మురళి మాట్లాడుతూ కరుణాకరును ఆదర్శంగా తీసుకొని పెండింగ్ చాలాన్ల వాహనదారులు పోలీసులు వాహనాలు ఆపినప్పుడు కాకుండా స్వచ్ఛందంగా వచ్చి పెండింగ్ చాలాన్స్ కట్టుకోవాలని సూచించారు.

Exit mobile version