సరంపల్లిలో విజయ డైరీ ఆధ్వర్యంలో గేదెలకు గాలికుంటు టీకా శిబిరం

సరంపల్లిలో విజయ డైరీ ఆధ్వర్యంలో గేదెలకు గాలికుంటు టీకా శిబిరం

అధ్యక్షుడు ఆకుల రవికుమార్ పర్యవేక్షణలో నాలుగు మంది వెటర్నరీ వైద్యుల సేవలు

రైతులు భారీగా ఉపయోగించుకున్న క్యాంపు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 15 

సరంపల్లి గ్రామంలో విజయ డైరీ అధ్యక్షులు ఆకుల రవికుమార్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే గాలికుంటు టీకా శిబిరాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. శిబిరంలో వెటర్నరీ వైద్యులు రవి కిరణ్, శ్రీనివాస్, ప్రవీణ్, బాలు తదితరులు పాల్గొని పశువులకు టీకాలు వేశారు. కార్యక్రమంలో డైరీ కార్యదర్శి కంచర్ల రాజగోపాల్, కమిటీ సభ్యులు కొత్తూరు బాల్రాజ్, మామిళ్ల నర్సింలు, సంగిశెట్టి నాగరాజు, పెరిక శ్రీనివాస్, కొత్తూరి రాజు, కుమార్, పోలు బాల్ నరసింహులు పాల్గొన్నారు. పలు మంది రైతులు క్యాంపును సద్వినియోగం చేసుకున్నారు.

Join WhatsApp

Join Now