బాన్సువాడలో బతుకమ్మ వేడుకల్లో గంప గోవర్దన్
తెలంగాణ సాంస్కృతిక ప్రతీకను ఎత్తుకున్న మాజీ విప్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 26
బాన్సువాడ పట్టణంలో ఘనంగా జరిగిన తెలంగాణ సాంస్కృతిక పండుగ బతుకమ్మ వేడుకల్లో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జ్, మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ పాల్గొన్నారు. మహిళలు, ప్రజలతో కలిసి బతుకమ్మ చుట్టూ నృత్యాలు చేస్తూ పూల పండుగను సంతోషంగా జరుపుకున్నారు.గోవర్దన్ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తుందని, ఈ పండుగ సాంప్రదాయాలు, సాంస్కృతిక విలువలను తరం తరాలకు చాటిస్తుందని పేర్కొన్నారు. ప్రజలతో కలిసి బతుకమ్మ ఎత్తుకోవడం తనకు గౌరవకరమని తెలిపారు.