గణపతి బోప్పా మోరియా.. కావాలయ్యా యూరియా..!

గణపతి బోప్పా మోరియా.. కావాలయ్యా యూరియా..!

రైతులకు సరిపడా ఎరువుల కోసం అసెంబ్లీ నుంచి ర్యాలీగా సాగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

ప్లకార్డులు చేతబట్టి వ్యవసాయ కమిషన్‌ కార్యాలయం వరకు ప్రయాణం

“పది ఏండ్లలో లేని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు?” అంటూ ప్రశ్నల వర్షం

“బ్లాక్ మార్కెట్‌కి వెళ్ళుతోందా యూరియా?” అంటూ గట్టిగా అరోపణలు

“తెలంగాణలో ఏం జరుగుతుందో మాకు తెలియాలి” అంటూ కేటీఆర్ డిమాండ్..

ప్రశ్న ఆయుధం,హైదరాబాద్, ఆగస్టు 30:

రైతుల కష్టాలను ఆయుధంగా చేసుకుని బీఆర్ఎస్ శాసన సభ్యులు ఘాటుగా పోరాటానికి దిగారు. అసెంబ్లీ హాలులోనే మొదలైన ఆవేదన, నినాదాలుగా మారి రోడ్లపైకి వచ్చింది. “గణపతి బోప్పా మోరియా.. కావాలయ్యా యూరియా..!” అంటూ నినాదాలు చేశారు.

వ్యవసాయ కమిషన్‌ కార్యాలయం ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ “పది ఏండ్లలో లేని యూరియా కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది? రైతులు క్యూలలో పడే పరిస్థితి ఎందుకు?” అని ప్రశ్నించారు. బ్లాక్ మార్కెట్‌పై కూడా సూటిగా వేలెత్తి చూపారు.

ఈ సందర్బంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ – “రైతులకు కావలసిన ఎరువులు అందకపోవడం రాష్ట్ర వ్యవసాయరంగానికి ముప్పు. ఈ కొరత వెనక అసలు కథేమిటో ప్రజలకు తెలియాలి. కేంద్రం, రాష్ట్రం కలసి రైతుల ప్రాణాలను ఎందుకు పరీక్ష పెడుతున్నారు?” అని మండిపడ్డారు.

తనదైన శైలిలో దాడి చేసిన కేటీఆర్, “మాకు తెలిసి యూరియా కొరత లేదు.. అయినా రైతులు క్యూల్లో పడుతున్నారు. అయితే ఈ యూరియా వెళ్ళేది ఎక్కడికి? బ్లాక్ మార్కెట్లోకేనా?” అని గట్టిగా ప్రశ్నించారు.

👉 రైతు సమస్యలపై మరోసారి హోరెత్తించిన బీఆర్ఎస్, రాబోయే రోజుల్లో ఈ పోరాటం మరింత మండి పడే సూచనలు కనిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment