గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
వినాయక మండప నిర్వాహకులు పోలీసులకు అందుబాటులో ఉండాలి
రూరల్ సీఐ లక్ష్మీనారాయణ
జమ్మికుంట ఇల్లందకుంట ఆగస్టు 26 ప్రశ్న ఆయుధం
గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని రూరల్ సీఐ లక్ష్మీనారాయణ వినాయక మండప నిరోహకులకు కోరారు సోమవారం రోజున అపర భద్రాద్రి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ ఇల్లంతకుంట ఎస్ హెచ్ ఓ క్రాంతి కుమార్ పాల్గొని మాట్లాడుతూ గణపతి మండప నిర్వాహకులు మండపం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండపంలో ప్రతిరోజు ఇద్దరూ చూసుకోవాలని పోలీసు వారికి అందుబాటులో ఉంటూ సమాచారం అందించాలని మండప కరెంట్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని చిన్న పిల్లలను కరెంటు దూరంగా ఉంచాలని లౌడ్ స్పీకర్లతో ఇరుగుపొరుగు వారిని ఇబ్బందులకు గురి చేయకూడదని కోరారు ఉత్సవాల్లో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల ఆవశ్యకతను వివరించారు వివిధ మత పెద్దల తో పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రతి మతాన్ని గౌరవిస్తూ శాంతి యుత వాతావరణం లో పండగలు జరుపుకోవాలని సూచించారు .
అలాగే వినాయక నవరాత్రి ఉత్సవాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు నిమర్జన సమయంలో తీసుకువాల్సిన జాగ్రత్తలను వివరించి మండపాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పండగ జరుపుకోవాలని తెలిపారు