Site icon PRASHNA AYUDHAM

గాంధారి ఆదర్శ హైస్కూల్ విద్యార్థుల క్రీడా ప్రతిభ

IMG 20251015 WA0545

గాంధారి ఆదర్శ హైస్కూల్ విద్యార్థుల క్రీడా ప్రతిభ

గాంధారి మండలం విద్యార్థులకు జోన్ స్థాయిలో ఘన విజయం

వాలీబాల్, కబడ్డీ పోటీల్లో క్రీడాకారుల అదరగొట్టే ప్రదర్శన

జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన మహేందర్, ఉషిత, అరవింద్ తదితరులు

రాష్ట్ర స్థాయిలో పోటీకి సిద్ధమవుతున్న అరవింద్

ప్రిన్సిపల్ మహేందర్ గౌడ్ అభినందనలు – భవిష్యత్తులో మరిన్ని విజయాలపై నమ్మకం

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 15

కామారెడ్డి జిల్లా గాంధారి, అక్టోబర్ 15 — గాంధారి మండల కేంద్రంలోని ఆదర్శ హైస్కూల్ విద్యార్థులు క్రీడా రంగంలో మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థి మహేందర్ వాలీబాల్‌లో, ఉషిత, అరవింద్, ప్రకాష్, విజయ్ సింగ్, రూపేశ్వర్, దీప్ సింగ్ కబడ్డీలో జోన్ స్థాయిలో మెరిసి కామారెడ్డి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

వారిలో అరవింద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తరఫున అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి కబడ్డి పోటీలలో పాల్గొననున్నాడు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ మహేందర్ గౌడ్ మాట్లాడుతూ, “ఇది మా విద్యార్థుల కృషికి లభించిన గుర్తింపు. భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయం సాధిస్తారనే నమ్మకం ఉంది” అన్నారు.

ఈ విజయాలతో ఆదర్శ హైస్కూల్ విద్యార్థులు మండలానికి గర్వకారణమయ్యారు.

Exit mobile version