గాంధారి వైద్యుడి అరుదైన రికార్డు

IMG 20251129 162745

 

*ఐదేళ్లలో 1500 డెలివరీలు పూర్తి చేసిన దొల్లు సాయిలు అలియాస్ సురేష్*

కామారెడ్డి జిల్లా, నవంబర్ 29, ప్రశ్న ఆయుధం: గాంధారి మండలానికి చెందిన డాక్టర్ దొల్లు సాయిలు అలియాస్ సురేష్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ సురేష్ అరుదైన గొప్ప రికార్డును నెలకొల్పారు. బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఆయన, గత ఐదేళ్లలోనే 1500 +కు చేరువైన సిజేరియన్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసి వైద్యవిభాగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గ్రామీణ, పట్టణ పరిసరాల్లో అధిక ఒత్తిడితో కూడిన సమయంలోనూ 24గంటలూ అందుబాటులో ఉంటూ, అత్యవసర ప్రసూతి సేవల్లో వెనుకాడకుండా పని చేయడం వల్లే ఈ గణాంకం సాధ్యమైందని సహచరులు పేర్కొన్నారు. గాంధారి మండలంలో ఇప్పటివరకు ఏ ఎంబీబీఎస్ వైద్యుడు సాధించని ఈ రికార్డు స్థానికులలో గర్వాన్ని నింపింది. నా భవిష్యత్తు ప్రజల ఆరోగ్యం” అనే నిబద్ధతతో డాక్టర్ సురేష్ పని చేస్తారని సిబ్బంది, ప్రజలు ప్రశంసిస్తున్నారు. తక్కువ వనరులు, అధిక రోగులు ఉన్న పరిస్థితుల్లోనూ ఆయన నిరంతర సేవలు అందించడం ప్రశంసనీయం అని ఆరోగ్య అధికారులు అభిప్రాయ పడ్డారు. గాంధారి మండల ప్రజలు, స్థానిక ప్రతినిధులు, వైద్య సిబ్బంది ఆయన సాధించిన ఈ విలక్షణ సేవా గణాంకాన్ని హృదయ పూర్వకంగా అభినందిస్తూ, “బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తూ ఇలాంటి ఘనత సాధించడం గాంధారి మండలానికి గర్వకారణం” అని వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment