బీసీ,ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు గండి:రాహుల్ గాంధీ..
కేంద్రంలోని వివిధ శాఖల్లో నేరుగా నియమించే ప్రక్రియ (లేటరల్ ఎంట్రీ) ఆగిపోయింది. విపక్షాలు ఒత్తిడికి చివరికి మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 2018 నుంచి అమలవుతున్న ఈ విధా నాన్ని మళ్లీ పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం మంగళ వారం ఇచ్చి ఆదేశాల మేరకు.. నాలుగు రోజుల క్రితం విడుదల చేసిన ఉద్యోగ ని యామకాల ప్రకటనను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) రద్దు చేసింది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడే విపక్ష నేత విపక్షనేత రాహుల్ గాంధీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని మండిప డ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కోటా రిజర్వేషన్లకు గండి కొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ సానుభూతిపరులకు దొడ్డిదారిలో కేంద్ర ప్రభుత్వంలో కీలక ఉద్యోగాలు ఇవ్వాలని చూస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. రాహుల్తో పాటు కేవలం విపక్ష పార్టీలే కాకుండా.. ఎన్డీయే భాగస్వాములైన ఎల్జేపీ, జేడీయూలు కూడా ఈ ప్రక్రియను వ్యతిరేకించాయి. ఎల్జేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి చిరాగ్ వైష్ణవ్ తెలిపారు. పాశ్వాన్ ఈ నియామకాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రైవేటు సెక్టార్లో ఎలాగో రిజర్వేషన్లు లేవని.. ప్రభుత్వ రిజర్వేషన్లకు గండి కొడితే ఎలా అంటూ ప్రశ్నించారు. మరోవైపు దీనిపై బీజేపీ నేతలు కాంగ్రెస్ ను కూడా విమర్శిస్తున్నారు. 2005లో కాంగ్రెస్ పాలనలోనే ఈ నేరుగా నియమకాల
వీరప్ప మెయిలీ నేతృత్వం లో సివిల్ సర్వీస్ సంస్కరణల కమిటీ పలు రంగాల నిపుణులను నేరుగా ఉన్నత ఉద్యో గాల్లోకి తీసుకోవాలని కాంగ్రెస్ సర్కార్ సిఫార్సు చేసినట్లు గుర్తు చేశారు. అలాగే 2013లో కూడా ఆరో వేతన సంఘం ఇదే చెప్పిందని పేర్కొన్నారు. 2018లో మోదీ సర్కార్ అమలు చేసిందన్నారు. అయిన ప్పటికీ దీనిపై కూటమిలో అభ్యంతరాలు రావండతో ప్రధాని కార్యాలయం చిరాగ్ పాశ్వాన్ సంప్రదింపులు జరిపారు. కేంద్రంలోని వివిధ శాఖల్లో ఉన్న జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ హోదాలో 45 మందిని నేరుగా నియమించడం కోసం ఈ నెల 17న యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో రాజకీయ వివాదం నెలకొంది. సిబ్బంది శాఖ మంత్రి జితేంద్రసింగ్ ఆ ఉద్యోగ ప్రకటనను రద్దు చేయాలని కోరుతూ యూపీఎస్సీకి లేఖ రాశారు. చివరికి కేంద్రం ఆదేశాల మేరకు యూపీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్ల సర్క్యులర్ జారీ చేసింది. నేరుగా నియాకాల ప్రక్రియను మళ్లీ పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి ఆ లేఖలో వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. ఆధార్ సంస్థ యూఐడీఏఐ చైర్మన్ గా నందన్ నీలేకనిని ఇదే ప్రక్రియలో నియమించారంటూ గుర్తు చేశారు. మరోవైపు దీనిపై యూపీఎస్సీ ప్రకటన వచ్చిన అనంతరం.రాజ్యాంగాన్ని, రిజర్వేషన్ల వ్యవస్థను రక్షిం చేందుకు ఎంతవరకైనా వెళ్తామని విపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ పోస్టు చేశారు.