ప్రజల్లో చైతన్యం కలిగించడానికి గణేష్ ఉత్సవాలు తోడ్పడతాయి
గెలుపు ఓటములు సాధారణం పోటీలను స్ఫూర్తిగా తీసుకోవాలి
ఆర్డీవో మహేశ్వర్ తాసిల్దార్ రాజ్ కుమార్
కరీంనగర్ ఆగస్టు 31 ప్రశ్న ఆయుధం
గణేష్ మండపంలో చదరంగం పోటీల కు విశేష స్పందన.
కరీంనగర్ లోని పాత బజార్ గోల్డెన్ యూత్ సౌజన్యంతో జీనియస్ చెస్ అకాడమీ నిర్వహణలో జరిగిన గణేష్ నవరాత్రి ఉత్సవాల మండపంలో జరిగిన చదరంగం పోటీలకు విశేష స్పందన లభించిందని గోల్డెన్ యూత్ నిర్వాహకులు అంబ్రిష్ టింకు పేర్కొన్నారు ఈ సందర్భంగా వివిధ ప్రదేశాల నుంచి 150 మందికి పైగా చదరంగం క్రీడాకారులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారని గెలుపొందిన క్రీడాకారులకు కరీంనగర్ ఆర్డిఓ మహేశ్వర్ పెద్దపల్లి తాసిల్దార్ రాజ్ కుమార్ చేతుల మీదుగా బహుమతి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మహేశ్వర్ మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున పోటీలను నిర్వహించిన గోల్డెన్ యూత్ నిర్వాహకులు అంబ్రిష్ , టింకు జీనియస్ చెస్ అకాడమీ నిర్వాహకులను అభినందించారు పోటీలో పాల్గొన్న క్రీడాకారులను గెలుపు ఓటములు సాధారణమని పోటీలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కోరారు ప్రజలలో చైత్యం కలిగించడానికి గణేష్ ఉత్సవాలు తోడ్పడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో జీనియస్ చెస్ అకాడమీ వ్యవస్థాపకులు కంకటి కనకయ్య డైరెక్టర్ అనుప్ కుమార్ గోల్డెన్ యూత్ నిర్వాహకులు అమ్రిష్ బాల కుటీర్ ఫౌండేషన్ శ్రీనివాస్ కోడూరు ప్రకాష్ గౌడ్ ప్రమోద్ కుమార్ రాపర్తి ప్రసాద్ సృజన్ కుమార్ న్యూరో ఫిజీషియన్ చంద్ర శ్రీనివాస్ తాటిపల్లి సతీష్ బాబు చీఫ్ ఆర్బిటర్ అరుణ్ రేవిక్ నితిన్ ప్రభుచంద్ర స్వాతి తదితరులు పాల్గొన్నారు.