తిమ్మాపూర్‌లో ఘనంగా గణేశ్ నిమజ్జనం
ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 5
తిమ్మాపూర్ (యెల్లారెడ్డి మండలం):
తిమ్మాపూర్ గ్రామంలో శ్రీ సంగమేశ్వర యూత్ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ గణేశ్ నిమజ్జనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సాయి బాబా, వినయ్, నాగరాజ్, రమేశ్, శశి, సురేందర్ తదితర యువసభ్యులు మండపం నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
గ్రామస్తులు ఏకతాటిపై చేరి కొలాటం, ఉట్టికొట్టడం, భజనలతో సాంస్కృతిక వాతావరణం నెలకొల్పారు. అనంతరం మండపంలో అన్నప్రసాద విందు ఏర్పాటు చేయగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భక్తి నినాదాల నడుమ గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేసి వేడుకలను విజయవంతంగా ముగించారు.